పెదకాకాని మండలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండల నియామకానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఆదేశాలు అందాయని ఏసి నల్ల కాల్వ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. ధర్మకర్తలుగా నియామకానికి ఆసక్తిగల వారు ఆలయ పనివేళల్లో అప్లికేషన్ పొందాలన్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 24వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని ఏసి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.