నరసరావుపేట పట్టణంలో అక్రమ మద్యం కేసులో మహిళను అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్సై సురేంద్రబాబు మంగళవారం తెలిపారు. సమాచారం మేరకు పట్టణంలోని బరంపేటలోని ఓ గృహంలో తనిఖీలు నిర్వహించామన్నారు. అక్కడ తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఆరుమధ్యం బాటిళ్లను మద్యం వాటిలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడుతున్న గృహ యాజమాని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు.