గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ల పోస్టులకు మంగళవారం డిప్యూటీ కమిషన్ బి. శ్రీనివాసరావు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా 153 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి సరైన ధృవపత్రాలు లేనందున వారి దరఖాస్తులు రిజెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన అనంతరం 117 మందిని అర్హులుగా ప్రకటించగా వారిలో 57 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారు.