తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలం పోతుపేటలో టీడీపీ నాయకులు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ములకలచెరువు మార్కెటింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఈశ్వరప్ప, నాయకులు శివానంద, రాంబాబు, నరసింహులు, రామచంద్ర, నరసింహులు, నరసింహులు పాల్గొన్నారు.