తంబళ్లపల్లె మండలంలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలకూ మెరుగైన వైద్యాన్ని అందించాలని కోసువారిపల్లి ప్రభుత్వ డాక్టర్ మునికుమార్ సూచించారు. స్థానిక ఆసుపత్రిలో ఆశా డే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆశాలకు పలు సూచనలు చేశారు. కార్య క్రమంలో ఎంపీ హెచ్ ఈఓ వెంకటరమణ, పీహెచ్ఎన్ సుమలత, ఎంపీహెచ్ఎస్ లలితమ్మ, మండలంలోని ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.