బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బట్టల బజారులో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 3 వేల మంది దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. అగ్నిమాపక, ఆర్మీ సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దేశంలోనే క్లాత్ మార్కెట్లకు నిలయమైన బంగాబజార్, ఇరుకైన దుకాణాలు, పెద్ద ఎత్తున జనంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు