క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో పని చేయాలని బొండపల్లి ఎంపీపీ చల్ల చలంనాయుడు అన్నారు. బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం సఖిపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమన్వయంతో పని చేసినప్పుడే మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో వేదవతి, డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ కల్పవల్లి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.