అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మన భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలోని బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.