మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కందుకూరు పట్టణ వైసిపి కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వాహించారు. ఎమ్మెల్యే మానగుంట మహీధర్ రెడ్డి జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. జగ్జీవన్ రామ్ దేశ అత్యున్నత ఉప ప్రధాని పదవి చేపట్టి హరిజన, బడుగు బలహీన, గిరిజన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. జగ్జీవన్ ఆశయాలను యువత ఆచరించి చూపాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa