ఎచ్చెర్లలోని డా. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న పీజీ పరీక్షలను వీసీ ఆచార్య నిమ్మ వెంకటరావు మంగళవారం పరిశీలించారు. సైన్స్ కోర్సులకు సంబంధించిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎటువంటి చూసిరాతలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాలని సంబంధిత సిబ్బందిని, అద్యాపకులను సూచించారు. అదేవిధంగా వర్శిటీలోని పలు కార్యాలయాలను వీసీ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్ కార్యాలయాలతో పాటు రిజిస్ట్రార్ కార్యాలయం, పరీక్షల విభాగపు కార్యాలయాలను వీసీ తనిఖీ చేసి సిబ్బంది హాజరుశాతాన్ని, సమయపాలనను పరిశీలించారు.