రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాగి జావా మధ్యాహ్నం భోజనం ముందుగానే ఇవ్వాలని నరసన్నపేట ఎంఈఓ ఉప్పాడ శాంతారావు ఆదేశించారు. మంగళవారం నరసన్నపేట మండలం గోపాల పెంట, పోతయ్య వలస ప్రాథమిక పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులకు, వంట ఏజెన్సీ సభ్యులకు తెలియజేస్తూ విరామ సమయంలో అనగా 10: 20 నిమిషాలకు రాగి జావా విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం వారంలో మూడు రోజులు మాత్రమే దీనిని ఇవ్వటం జరుగుతుందని విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థుల యొక్క సామర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.