ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని చిల్లపేటరాజం గ్రామానికి చెందిన కొంతల మణికంఠకు అరుదైన అవకాశం లభించింది. ఈ సందర్భంగా విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని కస్పా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కొంతల మణికంఠ రెండేళ్ల క్రితం టిసిఎస్ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపాడు. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మణికంఠను సన్మానించనున్నారని హెడ్ మాస్టర్ శంకరరావు బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ మేరకు మెయిల్ రూపంలో సమాచారం వచ్చిందని ఆయన తెలియజేశారు.