విశాఖపట్నంలో జరిగే టీడీపీ జోన్ వన్ సమీక్ష సమావేశానికి శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ కంచిలి మండల అధ్యక్షులు బుడ్డెపు కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో విశాఖ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతానికి పలు కీలక సూచనలు చేయనున్నారని కామేష్ రెడ్డి అన్నారు.