ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న గెలుపు మనందరి బాధ్యత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 05, 2023, 01:35 PM

రానున్న ఎన్నికల్లో కూడా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నని గెలిపించుకోవడం మనందరి భాధ్యత అని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లతో పాటు, గృహసారథులు తొలిసారి ఒక భారీ పార్టీ కార్యక్రమంతో ఈనెల 7 నుంచి 14 రోజుల పాటు ప్రజలతో మమేకం కావడానికి ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేస్తామన్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే బాధ్యతగల పౌరులుగా పని చేస్తారని తెలిపారు. ప్రభుత్వం పనితీరుపై పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రధానమైన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్‌’. అందుకే ఈ నినాదాన్ని కూడా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టామన్నారు.


ఈ నినాదమనేది తమకు తాముగా అనుకున్నది కాదన్నారు. సచివాలయాల ద్వారా వాలంటీర్లు క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తున్న సర్వేల ద్వారా పరిశీలిస్తే. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు సమాజంలో ఒక గుణాత్మకమైన మార్పు కనిపిస్తుందని నిరూపితమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో దాన్ని ఒకటికి రెండింతలు నిలబెట్టుకున్నారనీ అందుకనే జగన్‌మోహన్‌రెడ్డిని తామంతా నమ్ముతున్నామని ఈ రోజు ప్రజలు చెబుతున్నారన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీలు ఆరంగి మురళి, వాన గోపి, ప్రతినిధి ముద్దాడ బైరాగినాయుడు, జడ్పిటిసిలు వరుదు నాగేశ్వరమ్మ, చింతు అన్నపూర్ణ రామారావు, జేసిఎస్ మండల కన్వీనర్లు నక్క తులసీదాస్, సురంగి నరసింగరావు, కణతి సత్తిబాబు, ధర్మాన జగన్, పలు కార్పొరేషన్ చైర్మన్లు కోరాడ ఆశాలత గుప్త, చీపురు రాణి కృష్ణమూర్తి, రాజాపు అప్పన్న హైమావతి, పాగొటి రాజారావు, సర్పంచ్ బురెళ్ళ శంకర్, సాసుపల్లి కృష్ణబాబు, గెళ్ళంకి వెంకట్రావు, పొట్నురు సాయి ప్రసాద్, సదాశివుని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com