పెళ్లికి గిఫ్ట్ గా వచ్చిన హోం థియేటర్ పేలడంతో వరుడు మృతిచెందిన ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వధువు మాజీ ప్రియుడే హోం థియేటర్ లో బాంబు పెట్టి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తేలింది. నిశ్చితార్థం అయ్యాక వధువు తనను దూరం పెట్టిందనే కోపంతో నిందితుడు వధూవరులను చంపాలని బాంబు పెట్టాడని పోలీసులు తెలిపారు. నిందితుడు సర్జు మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేశారు.