వాహన డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఓ ట్రాలీ ఆటో వెనుకనుండి అతడ్ని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. అయితే, ఈ ప్రమాదం 5 నెలల కింద జరిగిందని, పోలీసులు ఆటో డ్రైవర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మృతుని కుమారుడు తెలిపాడు. ట్రాలీ ఆటో మున్సిపల్ కార్పొరేషన్ కి చెందినదిగా తెలుస్తోంది.