ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో ఇంట్లో ఉండేందుకు చాలామంది ఇబ్బంది పడతారు. దీంతో కూలర్, ఏసీల వినియోగం పెరుగుతోంది. అయితే ప్రతి ఇంట్లో ఏసీ పెట్టుకోవడం సాధ్యపడదు. కావున ఇంట్లో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఇంటిపై కూల్ రూఫ్ పెయింట్, లీక్ ప్రూఫ్ పెయింట్, తెల్లటి సిరామిక్ టైల్స్, షేడ్స్, సోలార్ ప్యానెళ్లు, చెక్క, రూఫ్ గార్డెనింగ్ లతో ఫ్లోరింగ్ ఏర్పాటు చేసుకోవడంతో ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు.