కేరళ పోలీసులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. చెంగనూర్ లో అప్పుడే పుట్టిన పసికందును ప్లాస్టిక్ బకెట్లో పడేసి వెళ్లిపోయారు. ఇది గమనించిన పోలీసులు పసికందు ప్రాణాన్ని కాపాడేందుకు వేగంగా చర్యలు చేపట్టారు. చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.