వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచకూడదని అలా ఉంచితే అశాంతి నెలకొంటుందని పండితులు పేర్కొంటున్నారు. చిరిగిన పాతబట్టలు, పాడైపోయిన అద్దం, గడియారం, పోయిన బూట్లు, చెప్పులు, పాడైన తాళాలు ఇంట్లో ఉంచకూడదని, ఇవి ఉంటే ఇంట్లో తరచూ గొడవలు జరుగుతాయంటున్నారు. అలాగే, పాత వార్తాపత్రికలు కూడా ఉంచకూడదు. నటరాజ స్వామి నృత్య రూపాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదంటున్నారు.