కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అనతి కాలంలోనే ప్రజాదరణ పొందాయి. ఈ రైళ్లలో రైల్వే శాఖ త్వరలో స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టనుంది. వీటిని తయారు చేసేందుకు వేలం కూడా పూర్తయింది. రష్యా కంపెనీ TMHతో భారతీయ రైల్వేకు చెందిన RVNL భాగస్వామ్యంతో వేలం దక్కించుకుంది. 120 కోట్లకు స్లీపర్ కోచ్ తయారు చేసేందుకు సిద్దమైంది. అయితే ఇవి ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయనేది ఇంకా తెలియలేదు.