తాడికొండ నియోజకవర్గం తాడికొండ మండలంలో గల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో బుధవారం వైఎస్ఆర్ ఆసరా మూడో విడత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్, తాడికొండ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, మండల నాయకులు, మండలం అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు భారీగా పాల్గొన్నారు. సమన్వయ కర్త కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు వచ్చినా మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి మహిళా లక్షాధికారి కావాలని కోరుకుంటూ ప్రతి గడప ఆనందంగా ఉండాలని నవరత్నాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మరోసారి రానున్న 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉండాలని కోరారు.