ఒకేసారి మూడు కిింగ్ కోబ్రాలు కనిపిస్తే జనం పరుగులు తీయడం సహజం. ఇదిలావుంటే అనకాపల్లి జిల్లాలో కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమయ్యాయి. దేవరాపల్లి మండలం తారువకు ఆనుకుని గెడ్డలో మూడు కింగ్ కోబ్రాలు జనాల్ని వణికించాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో అటుగా వెళ్లిన యువకులకు రెండు కింగ్ కోబ్రాలు బుసలు కొడుతూ కనిపించాయి. వెంటనే వాళ్లు యంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ విషయాన్ని చోడవరం రేంజర్ బీవీ వర్మకు ఫోను ద్వారా సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన విశాఖకు చెందిన ఈస్టెన్ వైల్డ్ఎఫ్ సొసైటీ ప్రతినిధి మూర్తితో ఫోన్‌లో సంప్రదించారు.
ఆయన దేవరాపల్లి బీటు అధికారి శివకుమార్, ఎఫ్‌డీఓ నారాయణతో వచ్చి పాములున్న చోటుకి ఇచ్చి నీరు పారుతున్న గెడ్డకు ఆనుకుని పొదల్లో ఉన్న మూడు రాచనాగుల్ని గుర్తించారు.. వాటిని పట్టుకోడానికి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు చాలా అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు మూడు రాచ నాగుల్ని పట్టుకుని సమ్మెదకు చేరువలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు అటవీ సిబ్బంది తెలిపారు. ఒక్కొక్క రాచనాగు 13 అడుగుల పొడవు కలిగి ఉందన్నారు. వాటిలో ఒక పాము మగ జాతికి చెందింది కాగా, ఆడపాములు ఆడ జాతికి చెందినవన్నారు.
ఈ కింగ్ కోబ్రాలు కేరళతో పాటూ మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా సంచరిస్తాయి. అయితే ఏపీలోని పశ్చిమ ఏజెన్సీలో మాత్రం గిరినాగులు అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఈ మధ్య తరచూ కనిపిస్తున్నాయి.. ఇవి చూస్తేనే వణుకు పుడుతోంది. గతంలో ఓ ఇంట్లో కూడా గిరనాగు ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. అలాగే పామాయిల్ తోటల్లో కనిపించాయి.
ఇదిలా ఉంటే గాజువాకలో పందులు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. పెదగంట్యాడ, వడ్లపూడి ఉక్కు నిర్వాసిత కాలనీలు, గాజువాక, చినగంట్యాడ ప్రాంతాల్లో పందులు చనిపోయినట్లు చెబుతున్నారు. దీంతో అధికారులు వెంటనే అనుమానంతో పందులకు వెటర్నరీ బయోలాజికల్ రీసెస్ ఇనిస్టిట్యూట్‌లో కొన్ని పరీక్షలు చేయించగా.. వరాహాలకు క్లాసికల్ స్వైన్ ఫీవర్, గొంతువాపునకు సంబంధించిన వైరస్ సోకుతుందని తేల్చారు. అందుకే అవి చనిపోతున్నాయి అంటున్నారు. చనిపోయిన వాటిని గాజువాక డంపింగ్ యార్డులో పూడ్చి పెట్టడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. జీవిఎంసీ సిబ్బంది అమప్రత్తమై కాలువల్లో, గెడ్డల్లో క్రిమిసంహారక మందులు చల్లుతున్నారు. ఈ కొద్దిరోజుల్లోనే చాలా పందులు మృత్యువాతపడ్డాయి.. అవి అలా పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు అంటున్నారు. జీవీఎంసీ సిబ్బంది వాటిని అక్కడ ినుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.