శింగనమలలో అతి పురాతనమైన శ్రీ ఆత్మ సీతారామ స్వామి కల్యాణం గురువారం అంగరంగ వైభవంగా ముగిసింది. శ్రీ సీతారాముల వారి కళ్యాణం శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి దంపతుల ధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఒంటిమిట్ట తరహాలో అదే పద్దతిలో శింగనమలలోఅదే రోజు అదే విధంగా సీతారాముల కల్యాణం వైభవంగా ప్రతి యేటా నిర్వహిస్తున్నారు. సీతారాముల కల్యాణం రాత్రి 8 గంటలకు ప్రారంభమైయి రాత్రి 10 గంటల వరకు వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంను నియోజకవర్గంలోని స్వాముల వారి భక్తాదులు తరలివచ్చారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆత్మరాములకు, సీతారాముల వారిని వేడుకున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వాముల వారి భక్తాదులు, వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.