నరసరావుపేటపట్టణం 33వ వార్డు బరంపేట లో నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో బుధవారం టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి దోచుకోవడం, దాచుకోవడం పై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అన్నారు.