గుంతకల్లు మున్సిపాలిటీలోని 15వ వార్డులోని బిఎస్ఎస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నాలుగు ఇంచుల తాగునీరు పైపు లైన్ నిర్మాణ పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించారు. పైపు లైన్ నిర్మాణంలో నాణ్యత ఉండాలని, లీకేజీలు లేకుండా పనులు చేయాలని గుత్తేదారుడిని ఆదేశించారు. పనులు జరుగుతున్న సమయంలో పర్యవేక్షణ చేయాలని అసిస్టెంట్ ఇంజనీరు శ్రీకాంత్ ను ఆదేశించారు. ఆయనతో పాటు ఆ వార్డు కౌన్సిలర్ రామాంజినేయులు (గుడ్ ఫైటింగ్ అంజి)ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు.