14వ తేదీ నుండి 30 వరకు జరిగే పాదయాత్రని జయప్రదం చేయాలనీ సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పిలుపు నిచ్చారు. బుధవారం హిందూపురం పట్టణంలో నియోజకవర్గ సిపిఐ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేమయ్య హాజరై మాట్లాడుతూ ఈ నేల అంబేద్కర్ జయంతి సందర్భంగా 14 నుండి భారతదేశవ్యాప్తంగా, భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), సిపిఎంను కలుపుకొని పాదయాత్రల కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీ వరకు, బిజెపి నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోడీ నిర్వహిస్తున్న కార్పొరేట్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచార ఆందోళన కార్యక్రమాలు, పాదయాత్రలు ఆయా నియోజకవర్గాల పరిధిలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.