గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి నాట్కో క్యాన్సర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన లినియర్ యాక్సిలేటర్ యంత్రం నిర్వహణకు ప్రభుత్వం 40 లక్షలు విడుదల చేసింది. ఆ నగదును క్యాన్సర్ విభాగం బ్యాంకు ఖాతాలో బుధవారం జమ చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నిధులను మంజూరు చేశారు. ప్రతి విభాగంలోనూ ఆరోగ్య శ్రీ పథకం కింద విడుదలయ్యే మొత్తాన్ని ఆయా విభాగాల అధిపతుల పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా నిర్ణయం తీసుకున్నారు.