ప్రకాశం జిల్లా గిద్దలూరు దళిత కార్యాలయంలో బుధవారం స్వాతంత్రం సమరయోధుడు సంఘసంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టిడిపి సీనియర్ నాయకులు కొండెపోగు దేవ ప్రభాకర్ మాట్లాడుతూ. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలో 1937 లో జన్మించిన ఆయన శాసనసభ్యునిగా, కేంద్ర మంత్రి గా, భారతదేశ ఉప ప్రధానమంత్రి గా పదవులు, అలంకరించారన్నారు. దళిత నాయకులు గుర్రం బాబురావు మాట్లాడుతూ. దళితుల, బడుగు బలహీన వర్గాలకు అండగా వారి అభ్యున్నతికి పాటుపడ్డారని ఆయన జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి డి పి ఎస్సి సెల్ నాయకులు దానియేలు జిల్లా నాయకులు కత్తి అనోజి రావు సీనియర్ నాయకుడు చెరుకుపల్లి లక్ష్మయ్య పానుగంటి ఇశ్రాయేలు కొమ్మునూరి వెంకటేష్ దూగ్గేపోగు చిన్న తదితరులు పాల్గొన్నారు.