రైల్వే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఎం రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం రేపల్లె రైల్వేస్టేషన్లో అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని ప్రయాణికులతో ముచ్చటించి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజర్వేషన్ బోగీలలో ప్రయాణికుల భద్రత కోసం గార్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఏడిఆర్ఎం సైమన్, అధికారులు బ్రహ్మానందరెడ్డి, రవిచంద్ర, శ్రీనివాస్, మనోజ్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.