కనిగిరిలో సుశీల అనే మహిళ హత్యకు గురైన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సుశీలకు వివాహంకాగా విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సుశీల వద్దకు మంగళవారం ఇళ్లు అద్దెకు కావాలని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. ఆమె వారికి ఇళ్లు చూపిస్తుండగా కిరాతంగా చంపారు. 10 లక్షలు కిరాయి ఇచ్చి ఆమె సోదరుడు శ్రీను చంపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం సోదరుడు శ్రీను పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు.