ఒంగోలు నగరం భాగ్యనగర్ లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో గురువారం నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ మూల్యాంకరం జరుగుతుందని ప్రభుత్వ మహిళ కళాశాల క్యాంపు ఆఫీసర్ డి. కళ్యాణి బుధవారం తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్, మూడో సంవత్సరం ఐదవ సెమిస్టర్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందన్నారు. మూల్యాంకనానికి నియమితులైన అధ్యాపకులు ఈనెల 6 స్క్రూటినైజర్లు ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం హాజరు కావాలన్నారు.