భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5353 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 25,587 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనను కలిగిస్తుంది. ఇప్పటికే కేంద్రం సమీక్ష నిర్వహించి రాష్ట్రాలకు పలు గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రజలంతా కూడా స్వీయ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్దులు అలర్ట్ గా ఉండాలన్నారు.