రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. నిపుణుల అంచనాలకు భిన్నంగా వడ్డీరేట్ల పెంపు విషయంలో RBI కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.