జగనన్నే మా భవిష్యత్ ప్రచార కార్యక్రమంలో మండల జెసిఎస్ కన్వీనర్, సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు స్థానిక నాయకులు అంతా చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సూచించారు. బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండల కేంద్రంలో బుధవారం మండల జేసిఎస్ కన్వీనర్, సచివాలయ కన్వీనర్లు, స్థానిక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఏప్రిల్ 7వ తేదీ నుండి 20 వ తేదీ వరకు నిర్వహిస్తున్న జగనన్నే మా భవిష్యత్తు ప్రచార కార్యక్రమం పై వైఎస్ఆర్సిపి నేతలకు, పార్టీ శ్రేణులకు, సచివాలయ కన్వీనర్లకు, గృహసారధులకు, దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం కన్వీనర్లు గృహసారథులు, వాలంటీర్లు ప్రతి ఇంటింటికి వెళ్లి 15 నుంచి 20 నిమిషాల పాటు కేటాయించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను వివరించాలన్నారు.