గత నెల 31న చోరీకి ప్రయత్నించి విఫలమైన కేసులో జామి మండలానికి చెందిన కె. మధును రెండో పట్టణ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని రిమాండుకు తర లించారు. రెండో పట్టణ ఎస్సై షేక్ శంకర్ బుధవారం వివరాలు వెల్లడించారు. గత నెల 31న దాసన్నపేట ఎస్బీఐ బ్రాంచిలో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి. లాకర్ తెరవడానికి ప్రయత్నించడంలో నిందితుడు మధు విఫలమయ్యారని, ఈ ఘటనపై బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
నిందితుడి వేలిముద్రల ఆధారంగా పాత నేరస్థుడు కె. మధు ఈ చోరీకి యత్నించాడని తెలుసుకోగలిగామన్నారు. కొత్తవలసలో ఏటీఎం చోరీ యత్నం, పెందుర్తి పోలీసు స్టేషన్ పరిధిలో మూడు కేసులు, విశాఖలో మరో కేసు ఆయనపై ఉన్నాయని, బుధవారం అదుపులోకి తీసుకొని నిందితుడ్ని విచారించగా నేరం అంగీకరించడంతో రిమాండుకు ఆయన్ని తరలించినట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు.