చిలకలూరిపేటలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గురువారం సీఎం జగన్ కు మంత్రి విడదల రజిని పలు సమస్యలను విన్నవించారు. చిలకలూరిపేటలో నీళ్ల సమస్య తీర్చడానికి రూ. 160 కోట్లు కేటాయించాలని కోరారు. పట్టణంలో అంబేద్కర్ భవన్, బీసీ భవన్, కాపు భవన్ మంజూరు చేయాలన్నారు. ముస్లిం సోదరులకు భరియల్ గ్రౌండ్ కోసం మొత్తం 5 ఎకరాలు కేటాయించాలన్నారు. నియోజకవర్గంలో కొన్ని లిఫ్టు ఇరిగేషన్ల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.