చిలకలూరిపేట: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా. మా చెల్లి, చిలకలూరిపేట ఎమ్మెల్యే కొన్ని సమస్యలను విన్నవించారు. అందులో తాగునీటి సమస్యకు రూ. 63 కోట్లను మంజూరు చేస్తున్నాం అని సీఎం జగన్ గురువారం ప్రకటించారు. అంబేద్కర్ భవన్, బీసీ భవన్, కాపు భవన్ లను కూడా మంజూరు చేస్తున్నామన్నారు. భరియల్ గ్రౌండ్ కు మరో 3 ఎకరాలను కేటాయించారు. లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులకు సంబంధించి. అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.