నగరం మండలం చిన్నమట్లపూడి గ్రామంలో వేంచేసిన రెడ్డంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు 4 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. గురువారం చిన్నమట్లపూడిలోని ఆలయాన్ని సందర్శించిన ఎంపీ మోపిదేవి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పెద్దలకు నాలుగు లక్షల విరాళాన్ని అందించారు. కార్యక్రమంలో నగరం ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, వైసీపీ నాయకులు ప్రసాదం వాసుదేవ, గ్రామస్తులు పాల్గొన్నారు.