నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా బుధవారం సెలవు రోజు స్థానిక ఉర్దూ బాలికల పాఠశాల 4వ తరగతి క్లాస్ రూంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు "మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమం పై కార్యాచరణ, ప్రణాళిక సమావేశం నిర్వహించారు. విద్యా బుద్దులు నేర్పే తరగతి గదిలో వైసిపి నేతలు పార్టీ కార్యక్రమం నిర్వహించడం పై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యా శాఖ అధికారుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.