హొళగుంద: హొళగుంద మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో వైయస్ఆర్ ఆసరా 3వ విడత వారోత్సవాలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం బుధవారం ముఖ్యఅతిథిగా పాల్గొని మండల వ్యాప్తంగా మొత్తం వై. యస్. ఆర్ ఆసరా పధకం కింద 199 మహిళా సంఘాల గ్రూపు లకు సంబంధించిన దాదాపు 65లక్షల మెగా చెక్కును పంపిణీ చేసి మహిళలతో కలిసి సీఎం జగనన్న చిత్ర పటానికి పాల అభిషేకం చేసి, సీఎం జగనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట సుబ్బయ్య, సర్పంచ్ చాలవాది రంగమ్మ, మండల కన్వీనర్ షఫీ, ఎంపీపీ తనయుడు ఈషా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ శేషప్ప, మండ లంలోని ఎంపీసీ సభ్యులు, సర్పంచ్ లు, వైస్సార్సీపీ నాయకులు, మహిళా సంఘాలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.