ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గురువారం పదవ తరగతి హిందీ పరీక్ష విద్యార్థులు ప్రశాంతంగా రాశారు. పరీక్ష కేంద్రాల సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష సెంటర్లోకి అనుమతిస్తున్నారు. పట్టణంలోని పరీక్ష కేంద్రాలను పట్టణ ఎస్ఐ శశి కుమార్ తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినందున గుంపులు గుంపులు లేకుండా చూడాలని సిబ్బందికి ఎస్ఐ తెలియజేశారు