ఢిల్లీ పర్యటన అనంతరం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అయన మాట్లాడుతూ.... ‘‘అనేక అంశాలపై కేంద్ర పెద్దలతో సుదీర్ఘంగా చర్చించాం. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా, వైసీపీ విముక్త ఏపీ వైపు అంతా అడుగులు వేస్తారన్న నమ్మకం మాకు కలిగింది. రాబోయే రోజుల్లో సంస్థాగతంగా జనసేన బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జిల్లాల వారీగా కార్యక్రమాలు చేయబోతున్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని పాపం జగన్రెడ్డిదే’ అని మనోహర్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టిన తీరుకు జగనన్న పాపం పథకం అని పేరు పెట్టాలన్నారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని చెప్పి ఇప్పుడు నెపం కేంద్రం మీద వేస్తున్నారన్నారు.