నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. పొట్టేపాళెం కలుజు వంతెన మరమ్మతులపై జలదీక్షకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి జలదీక్షకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి ఎదుటే కోటంరెడ్డి దీక్షకు దిగారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కోటంరెడ్డి అనుచరులు నినాదాలు చేస్తున్నారు.‘ఏదో డాన్ ఇంటిని ముట్టడించినట్టు నా ఇంటిని, మాగుంట లే అవుట్ మొత్తం రౌండప్ చేస్తారా?’ అంటూ కోటంరెడ్డి ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా దీక్ష చేస్తానని తేల్చి చెప్పారు. ‘మీరు డ్యూటీలు మాని ఎంతో కాలం నా వెనుక తిరగలేరు’ అని స్పష్టం చేశారు. ఎస్పీ, డీఎస్పీని అనుమతి కోరానని.. ఏదైనా ఉంటే తనను క్లారిఫికేషన్ అడగొచ్చన్నారు. వంతెన నిర్మాణానికి సీఎం ఫైల్ మీద సంతకం చేశారని.. జీవో ఇప్పిస్తే... వచ్చి పూలమాల వేస్తానని కోటంరెడ్డి స్పష్టం చేశారు.