దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఈ కేసులో ఈడీ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ, గౌతమ్ మల్హోత్ర, రాజేశ్ జోషిలపై ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. ఫిబ్రవరి 7వ తేదీన గౌతమ్ మల్హోత్ర, 8న రాజేశ్ జోషి, 10న మాగుంట రాఘవను అరెస్ట్ చేసినట్టు ఈ ఛార్జ్ షీట్ లో ఈడీ తెలిపింది. ఈ అనుబంధ ఛార్జ్ షీట్ పై ఈ నెల 14న సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది. కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ అనుబంధ ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకోవాలో, లేదో అనే విషయాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చనుంది.