ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ నేతల ఆహ్వానంతో కాషాయ కండువా కప్పుకోనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు జరగనుండగా ఈ క్రమంలో కిరణ్ కుమార్ ఎంట్రీ బీజేపీగా ఎలా కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.