గుంతకల్లు పట్టణంలోని పాతగుత్తి రోడ్డులో వెలసిన శ్రీ అంబమ్మ దేవి రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయం లో అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు, విశేష పుష్పాల అలంక రణలు చేశారు. అనంతరం సాయం త్రం రథాన్ని విశేష పుష్పాలతో అలం కరణ చేశారు. రథంలో అంబామ్మ దేవి ఉత్సవ మూర్తిని కొలువు తీర్చారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగారు. రథోత్సవం లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెండవ పట్టణ పోలీసులు బందో బస్తు నిర్వహించారు.