బుక్కపట్నం మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో ముగ్గురు వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడినట్టు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. ఎస్ఐ తెలిపిన మేరకు. కొండాపురం గ్రామంలో కొంతకాలంగా రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ తరుణంలోనే రేషన్ బియ్యం, సరిగా పంపిణీ చేయలేదన్న కారణంతో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన నల్లపరెడ్డి, మాధపురెడ్డి, మల్లేశ్ప పథకం ప్రకారం కొడవళితే దాడిచేశారు. ఈ సంఘటనలో దాడిచేసిన మోహన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, చింతలరెడ్డితో పాటు మరో ఇద్దరి అనుమానితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు.