ఏపీలో చెత్త ప్రభుత్వం ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉందని, వైకాపా ఓటమి అంచుల్లో ఉందన్న విషయం జగన్కు కూడా తెలుసని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. వైకాపా ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న బాలయ్య, చాలా మంది తమ పార్టీతో టచ్లో ఉన్నారని చెప్పారు. టీడీపీలో చేరేందుకు వాళ్లు రెడీగా ఉన్నారని తెలిపారు.