సింగనమల నియోజకవర్గంలో నారా లోకేష్ చేపడుతున్న పాదయాత్ర పై టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. గురువారం సాయంకాలం ఉరవకొండ నియోజకవర్గం నుండి సింగనమల నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పుడు వరకు చేపట్టిన పాదయాత్రలో ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ లు ఘన స్వాగతం పలకడం, నారా లోకేష్ వెంట పాదయాత్రలో పాల్గొనడం కనిపిస్తూ వస్తోంది. అయితే సింగనమల నియోజకవర్గంలో దానికి విరుద్ధంగా ఎస్సీ నియోజకవర్గం మరియు ఎస్సీ మహిళా నాయకురాలు బండారు శ్రావణిని పక్కన పెట్టి ద్విసభ్య కమిటీ సభ్యులు ఓసి సామాజిక వర్గానికి చెందిన ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసయ్యనాయుడు ఘన స్వాగతం పలుకడంతో పాటు లోకేష్ పాదయాత్రలో పక్కన నడవడం శ్రావణికి అధిక ప్రాధాన్యత ఇవకపోవడంతో బండారు శ్రావణికి చెందిన టిడిపి కార్యకర్తలు అనుచర వర్గం మండిపడుతున్నారు.
టిడిపి పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్న చంద్రబాబు నాయుడు దీనికి ఏం సమాధానం చెబుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గంలో ఓసీల పెత్తనం ఏందుకు ఇస్తున్నారని టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. గార్రదిన్నెలో నిర్వహించే బహిరంగ సభలో బండారు శ్రావణికి ప్రాధాన్యత ఇవ్వకపోతే తాము ఆందోళన వ్యక్తం చేస్తామని పలువురు టిడిపి కార్యకర్తలు బహిరంగంగా తెలియజేస్తున్నారు.