తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డు విశాల్ మార్ట్ ఎదురుగా 1కేజీ చికెన్ ను రూ. 150 కే అందిస్తున్నారు. తాడిపత్రి మండలం గంగాదేవిపల్లి గ్రామానికి చెందిన సోదరులు రంగనాథ రెడ్డి, భాస్కర్ రెడ్డి కేజీ చికెన్ దాదాపు గా రూ. 30 తక్కువకు ఇస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో దాదాపు గా ఇదే రేటు నడుస్తావుంది. చికెన్ తీసుకున్న వారు తూకం చెక్ చేశారు. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని అంటున్నారు. ఇన్ని రోజులు అనంతపురం కోళ్లు వేరు తాడిపత్రి కోళ్లు వేరు అని చెప్పి వినియోగదారుల ను మోసం చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విక్రయ దారున్ని సైతం బుట్టలో వేసుకొని తమ పబ్బం గడువు కోవలనే ఆలోచన స్థానిక చికెన్ సిండికేట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రంజాన్ మాసం లో మరింత రేటు పెరిగే చికెన్ ఈ సోదరుల సందర్భంగా తక్కువగా దొరుకుతుందని ముస్లిం సోదరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.